: రాహుల్కు పట్టం కట్టే భేటీకి సోనియా అందుకే రాలేదా?
కాంగ్రెస్ పార్టీ పగ్గాలను పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్కు అప్పగించేందుకు ఏర్పాటు చేసిన సీడబ్ల్యూసీ భేటీకి పార్టీ చీఫ్ సోనియా ఎందుకు రాలేదు? రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశమైంది. అనారోగ్య కారణాలతోనే ఆమె భేటీకి హాజరు కాలేకపోయారని కొందరు అంటుంటే, అదేమీ లేదని కొందరు తేల్చేస్తున్నారు. రాహుల్ గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించే అంశంపై సీడబ్ల్యూసీలో చర్చించాలని నిర్ణయించారు. అప్పుడే తీర్మానం కూడా చేయాలని భావించారు. ఈ కారణంగానే ఆమె భేటీకి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. సోనియా గాంధీ సమక్షంలోనే ఆమెను తప్పించాలని చర్చ జరగడం, రాహుల్ గాంధీ ఆ చర్చలో పాల్గొనడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంటుందని భావించిన సోనియా దీనికి డుమ్మా కొట్టినట్టు చెబుతున్నారు. అందుకే ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా భేటీకి దూరంగా ఉన్నారని సమాచారం.