: కాంగ్రెస్ పగ్గాలను చేపట్టాలంటూ ఏకగ్రీవంగా కోరిన సీడబ్యూసీ.. తిరస్కరించిన రాహుల్!


కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ అయిన రాహుల్ గాంధీ వెంటనే పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ, అత్యంత కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఏకగ్రీవంగా కోరింది. ఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశంలో, రాహుల్ గాంధీ ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఉండాలంటూ విన్నవించింది. అయితే, ఎప్పట్లాగానే సీడబ్ల్యూసీ విన్నపాన్ని రాహుల్ తిరస్కరించారు. దీనికితోడు, త్వరలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో మరో ఏడాది పాటు సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగించాలని సీడబ్ల్యూసీ చివరకు తీర్మానించింది. ఈ నిర్ణయాన్ని త్వరలోనే ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. మరోవైపు, పార్టీ అధినేత్ర సోనియాగాంధీ అనారోగ్య కారణాలతో ఈ సమావేశానికి హాజరుకాలేదు.

  • Loading...

More Telugu News