: స్నేహితుడి ప్రాణం తీసిన ఇడ్లీ డబ్బుల గొడవ!
ఇడ్లీ డబ్బుల వివాదం స్నేహితుడి ప్రాణం తీసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కోయంబత్తూరు సమీపంలోని తీతిపాళ్యం గ్రామానికి చెందిన మరప్పన్, శర్వణన్ లు స్నేహితులు. వారిద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం శర్వణన్ ఇడ్లీలు తినాలని భావించాడు. దీంతో ఇడ్లీలు తినేందుకు డబ్బులివ్వాలని మరప్పన్ ను కోరాడు. దానికి ఆయన నిరాకరించడంతో ఇద్దరూ గొడవపడ్డారు. తరువాత దగ్గర్లోని వాటర్ ట్యాంకర్ గోడ ఎక్కి అక్కడ వారిద్దరూ కలిసి గంజాయి తాగారు. అనంతరం ఇడ్లీలు తినేందుకు మరప్పన్ ను మళ్లీ డబ్బులు అడిగాడు. గతంలో ఇచ్చిన సమాధానమే మళ్లీ శర్వణన్ ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మరప్పన్ ఆ గోడపైనుంచి శర్వాణన్ ను కిందికి తోసేశాడు. దీంతో కిందపడ్డ శర్వణన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆతనిని హుటాహుటీన కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు.