: హైదరాబాద్‌లో దారుణం.. తన చావుకు ఇంటి యజమానే కారణమని గోడలపై రాసి వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని శ్రీనివాస నగర్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి యజమాని వేధింపులతో సుజాత అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి యజమాని ప్రసన్న కుమార్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గోడ, తలుపులపై ఆమె రాసింది. ప్రసన్నకుమార్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, తమ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి తనపై దాడి చేశాడని పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంటి యజమాని ప్రసన్నకుమార్ పరారీలో ఉన్నాడు.