: భారత్ తో మా బంధం ప్రత్యేకమైనది... ఇది ఇంకా బలపడాలి: థెరెసా మే


భారత్ తో బ్రిటన్ కు ఉన్న బంధం ప్రత్యేకమైనదని బ్రిటన్ ప్రధాని థెరెసా మే చెప్పారు. ఈ బంధం మరింత బలపడాలని ఆమె ఆకాంక్షించారు. ప్రధాని మోదీ చేపట్టిన 'మేకిన్ ఇండియా' కార్యక్రమం చాలా గొప్పదని ఆమె కొనియాడారు. కేవలం ఆర్థిక విషయాల్లోనే కాకుండా... ఇతర అంశాల్లో కూడా ఇరు దేశాల మధ్య ఎన్నో పోలికలున్నాయని చెప్పారు. భారతదేశ పెట్టుబడులు బ్రిటన్ ఆర్థిక రంగానికి చాలా మేలు చేస్తాయని తెలిపారు. ఆర్థిక, సామాజిక సంస్కరణలపై తాము మరింత దృష్టి సారించామని చెప్పారు.

  • Loading...

More Telugu News