: షోపియాన్‌లో ఉగ్రవాదులతో హోరాహోరీ.. ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న కాల్పులు
దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఓ టెర్రరిస్ట్ హతమయ్యాడు. ఇద్దరు భారత సైనికులు గాయపడ్డారు. వంగమ్ గ్రామంలో ఆదివారం రాత్రి ఉగ్రవాదులతో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. పూంచ్ జిల్లాలో నిన్న పాక్ దళాల కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. కాగా గత రెండు వారాల్లో పాక్ దళాల కాల్పుల్లో 8 మంది భారత జవాన్లు అమరులయ్యారు. 8 మంది పౌరులు మృతి చెందారు. సెప్టెంబరు 29న సర్జికల్ దాడుల తర్వాత పాకిస్థాన్ ఇప్పటి వరకు 60 సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.