: యూఎస్ ఎన్నికల్లో చివరి ట్విస్ట్... హిల్లరీపై ఎలాంటి కేసూ లేదన్న ఎఫ్బీఐ


మరికొన్ని గంటల్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న డెమోక్రాట్ల తరఫు అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ కు పెద్ద ఊరట లభించింది. యూఎస్ ఎన్నికల్లో చివరి ట్విస్ట్ గా, హిల్లరీపై ఈ-మెయిల్స్ బహిర్గతానికి సంబంధించి ఎలాంటి నేరపూరిత ఆరోపణలూ లేవని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరెక్టర్ జేమ్స్ కోమే వెల్లడించారు. యూఎస్ కాంగ్రెస్ మాజీ సభ్యుడు ఆంటోనీ వీనర్ దగ్గరున్న అన్ని ఈ-మెయిల్స్ పరిశీలించామని, పగలనకా, రాత్రనకా తాము జరిపిన విచారణలో క్లింటన్ పై అభియోగాలు నమోదు చేసేందుకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలిపారు. కాగా, ఎన్నికలు మరో 48 గంటల్లో ఉన్న సమయంలో ఎఫ్బీఐ నుంచి వచ్చిన ఈ ప్రకటన క్లింటన్ బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

  • Loading...

More Telugu News