: పూజలు చేసి వస్తున్న ఆరుగురు మహిళలను ఢీకొన్న రైలు
పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఛాత్ పూజలు నిర్వహించి తిరిగి వెళ్తున్న ఆరుగురు మహిళలు ఘోర ప్రమాదంలో మృత్యుఒడికి చేరారు. వీరు ఓ రైల్వే స్టేషన్ పట్టాలను దాటుతున్న వేళ వేగంగా దూసుకొచ్చిన రైలు అందరి ప్రాణాలనూ తీసింది. ఈ ఘటన బీహార్ లో జరిగింది. రామ్ బంద్రాపూర్ రైల్వే స్టేషన్ లో పూజలు చేసి వస్తున్న ఈ ఆరుగురినీ రైలు ఢీకొనడంతో వారి కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించామని రైల్వే పోలీసులు వెల్లడించారు.