: ఇక అక్షరం ముక్క రాకున్నా డ్రైవింగ్ లైసెన్స్.. చట్ట సవరణకు సిద్ధం!
డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కనీసం 8వ తరగతి వరకూ చదువుకొని ఉండాలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపై ఈ నిబంధన తొలగిపోనుంది. డ్రైవింగ్ బాగా తెలిసున్న వ్యక్తికి చదువు రాకపోయినా, లైసెన్స్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఈ దిశగా చట్టాన్ని సవరించేందుకు కసరత్తు ప్రారంభించిన మోదీ సర్కారు,. ముసాయిదా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంత బాగా వాహనం నడుపుతున్నా, విద్యార్హత లేక డ్రైవింగ్ లైెసెన్స్ పొందలేక ఇబ్బంది పడుతున్న డ్రైవర్లు ఎందరో ఉన్నారు. వారి డిమాండ్ల మేరకు, ప్రభుత్వం లైసెన్స్ కు, విద్యార్హతలకు ఉన్న లింక్ ను తొలగించేందుకు కదిలింది. అయితే, విద్యార్హతలను పూర్తిగా పక్కన బెట్టకుండా, రోడ్డు ప్రమాదాలను నియంత్రించే అంశాలపై స్వల్పకాల శిక్షణ, ఆపై రాత పరీక్ష నిర్వహించి, అందులో ఉత్తీర్ణత సాధిస్తే, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అర్హతను కల్పించాలన్నది కేంద్రం అభిమతంగా తెలుస్తోంది.