: వారు దోచుకొన్న ప్రజాధనాన్ని రికవరీ చేస్తే ఏ హోదా, ప్యాకేజ్ లతోనూ పనిలేదు: టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలో జగన్, కేవీపీ, విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ కలిసి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని, ఆ ధనాన్ని రికవరీ చేస్తే కనుక, ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజ్ కానీ అవసరం లేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సమైక్యాంధ్ర కోసం టీడీపీ ఎంపీలు పోరాడుతున్న సమయంలో రాష్ట్రాన్ని విభజించమని పార్లమెంటులో చెప్పిన జగన్ కు ప్రత్యేక హోదాపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాజకీయ అవగాహన లేని జగన్, ప్రత్యేకహోదాపై అవగాహనా సదస్సు నిర్వహించడం చాలా విచారకరమన్నారు.