: ఫ్లోరిడాలో హిందూ దేవాలయాన్ని సందర్శించిన ట్రంప్ కుమారుడు
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం ఆసన్నమైన తరుణంలో ఎన్ఆర్ఐ ల మద్దతు కూడగట్టుకునే పనిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ తలమునకలయ్యారు. ఫ్లోరిడాలోని హిందూ దేవాలయాన్ని ఆయన సందర్శించారు. భారతీయ వస్త్రధారణ అయిన షేర్వాణి ధరించిన 32 సంవత్సరాల ఎరిక్ అక్కడ నిర్వహించిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి గురించి అర్చకులు ఆయనకు వివరించారు. కాగా, హిందూ దేవుళ్లయిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడికి సంబంధించిన కథలను ఎరిక్ అక్కడి వారికి చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, ట్రంప్ కోడలు లారా ట్రంప్ హిందూ దేవాలయంలో దీపావళి పండగ జరుపుకోవడం విదితమే.