: ‘జై ఆంధ్రప్రదేశ్’ నినాదంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి: వైఎస్ జగన్
‘జై ఆంధ్రప్రదేశ్’ అనే నినాదంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలి అని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. విశాఖపట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి స్ఫూర్తి విశాఖ నగరమని, ఏపీకి ప్రత్యేకహోదా సాధించుకోవడానికి కూడా ఇదే నగరం స్ఫూర్తి కానుందని అన్నారు. ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని నేతలు గతంలో విశాఖపట్టణం నుంచే హామీ ఇచ్చారని, కానీ, ఆ హామీని నెరవేర్చలేదంటూ ఆయన మండిపడ్డారు. తన ప్రసంగంతో ఊదరగొట్టేందుకు ఇక్కడకు తాను రాలేదని, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేదన్న తన బాధను పంచుకోవడానికే ప్రజల మధ్యకు తాను వచ్చానంటూ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.