: విశాఖలో సభాస్థలికి చేరుకున్న వైఎస్ జగన్
విశాఖలో నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ సభాప్రాంగణానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని నిమిషాల క్రితం చేరుకున్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.