: చంద్రబాబు నివాసానికి మరింత భద్రత


ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి మరింత భద్రత పెంచారు. అదనంగా మరో 25 మంది సాయుధ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ తో కలిసి ఏపీ డీజీపీ సాంబశివరావు ఈరోజు అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ, ఇటీవల ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ విషయాన్ని ప్రస్తావించారు. పోలీసులపై బురదజల్లడం మావోయిస్టులకు అలవాటైపోయిందని, ఇందుకు నిదర్శనం మావోయిస్టు అగ్రనేత ఆర్కే విషయంలో తమపై వారు చేసిన ఆరోపణలేనని అన్నారు. గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తామన్నారు.

  • Loading...

More Telugu News