: జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్తత.. పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి
భారత్-పాక్ సరిహద్దులో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోమారు ఉల్లంఘించిన పాక్ ఈ తెల్లవారుజామునుంచి యథేచ్ఛగా కాల్పులకు పాల్పడుతోంది. పూంచ్ జిల్లాలోని కేజీ సెక్టార్‌లో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో భారత జవాను మృతి చెందాడు. పాక్ కాల్పులకు భారత సైన్యం దీటుగా జవాబిస్తోంది. ఉరీ ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న పాక్ ప్రతిరోజు కాల్పల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది.