: టీడీపీని శాశ్వతంగా అధికారంలో ఉంచండి... కార్యకర్తకు అన్యాయం జరగనివ్వను: చంద్రబాబు
ఏపీలో టీడీపీని శాశ్వతంగా అధికారంలో ఉంచేందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. కష్టపడే ఏ కార్యకర్తకూ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ పడే మరే ఇతర పార్టీకీ డిపాజిట్లు రాకూడదని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యతలను కార్యకర్తలు భుజానికెత్తుకోవాలని చెబుతూ, కార్యకర్తలు తెచ్చే సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు కృషి చేయాలని మంత్రులకు ఆయన సూచించారు. తెలుగుదేశం ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉండిపోవాలని అన్నారు. పేదలైన కార్యకర్తలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారానూ, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారానూ సాయం చేస్తామని వివరించారు.