: దేశ క్షేమం కోసమే ఎన్డీటీవీపై నిషేధం: వెంకయ్యనాయుడు


తమ ప్రభుత్వానికి మీడియా స్వేచ్ఛపై గౌరవం ఉన్నప్పటికీ, దేశ క్షేమం కోసమే ఎన్డీటీవీపై ఒక రోజు నిషేధం విధించామని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గతంలోనూ ప్రభుత్వాలు ఇదే తరహా ఆంక్షలు విధించాయని, దీనిపై విపక్షాల రాద్ధాంతం అనవసరమని అన్నారు. పఠాన్ కోట్ పై ఉగ్రవాదుల దాడి వార్తలను చూపుతూ ఎన్డీటీవీ చూపిన దృశ్యాలను ఉగ్రవాదులు చూస్తే, సైనికులతో పాటు పౌరుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతుందని భావించిన మీదటే, ఇకపై ఆ తరహా దృశ్యాల ప్రసారం కూడదని హెచ్చరించేందుకే ఈ నిషేధం విధిస్తున్నామని అన్నారు. 2005 నుంచి 2014 మధ్య 21 సార్లు ఎన్నో టీవీ చానళ్లపై ఒక రోజు నుంచి రెండు నెలల పాటు నిషేధం అమలైందని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ, ఎడిటర్స్ గిల్డ్ విమర్శలనూ కొట్టి పారేశారు.

  • Loading...

More Telugu News