: ఉత్కంఠగా సాగిన పోటీలో మన అమ్మాయిలు అదరగొట్టారు: హాకీ మహిళల జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు
సింగపూర్‌లో జరిగిన ఆసియన్ చాంపియన్స్ హాకీ మహిళల ట్రోఫీని భారత హాకీ క్రీడాకారిణులు కైవసం చేసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఉత్కంఠగా సాగిన పోటీలో మన అమ్మాయిలు అదరగొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. వారికి అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదే పురుషుల జట్టు కూడా ఆసియా హాకీ ట్రోఫీ గెలిచిందని, మళ్లీ ఇప్పుడు మహిళల జట్టుకూడా గెలవడం విశేషమని చంద్రబాబు అన్నారు. భారత క్రీడాకారులు ఇలాగే రాణించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.