: హైదరాబాద్‌లో మద్యంతాగి స్కూలు విద్యార్థుల ఆటో నడుపుతున్న డ్రైవర్ అరెస్ట్


హైదరాబాద్‌లో ఈ రోజు డ్రంకెన్ డ్రైవ్ సోదాలు నిర్వ‌హిస్తోన్న పోలీసుల‌కి మ‌ద్యం తాగి స్కూలు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్ ప‌ట్టుబ‌డ్డాడు. ఆటో డ్రైవర్ మొహమ్మద్ ఉస్మాన్‌ ప్రతిరోజూ కింగ్‌కోఠిలోని సెయింట్‌ జోసెఫ్ స్కూలు నుంచి విద్యార్థులను తీసుకెళ్తుంటాడని పోలీసులు మీడియాకు తెలిపారు. తాము మ‌ల‌క్‌పేట్‌లో చేప‌ట్టిన డ్రంకెన్ డ్రైవ్ త‌నిఖీల్లో అతనిని ప‌ట్టుకున్న‌ట్లు చెప్పారు. పిల్ల‌ల‌కి ప్ర‌మాదాలు తెచ్చిపెట్టే ఇటువంటి ఆటోడ్రైవ‌ర్‌ల ప‌ట్ల చిన్నారుల‌ త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త వ‌హించాల‌ని హెచ్చ‌రించారు.

  • Loading...

More Telugu News