: హైదరాబాద్‌లో కొనసాగుతున్న రహదారి మరమ్మతులు.. భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షానికి అనేక ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయిన సంగతి తెలిసిందే. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్ల మధ్యలో గుంతలు ఏర్పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో రహదారి మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ కారణంగా నగరంలోని పలుచోట్ల ఈ రోజు భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ రోజు ఖైరతాబాద్ లో రహదారి మరమ్మతులను చేపట్టారు. దీంతో ఖైరతాబాద్ నుంచి సోమాజిగూడ, నిమ్స్, పంజాగుట్ట ఫ్లై ఓవర్ వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఆయా ప్రాంతాల పరిసర రోడ్లపై వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి.