: ఐశ్వర్యా రాయ్ పై బచ్చన్ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి


బచ్చన్ ఫ్యామిలీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్యా రాయ్ పై బచ్చన్ కుటుంబీకులు తీవ్ర అసంతృప్తితోను, ఆగ్రహంతోనూ ఉన్నారట. దీనికంతటికీ కారణం ఇటీవలే విడుదలై, సూపర్ హిట్ అయిన 'యే దిల్ హై ముష్కిల్' సినిమానే అని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. పరిధులు దాటి, శృంగార సన్నివేశాల్లో ఐశ్వర్య హాట్ హాట్ గా నటించడమే వారి కోపానికి కారణమట. బచ్చన్ ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా 'యే దిల్ హై ముష్కిల్' సినిమాను వేసినా... అమితాబ్, జయా బచ్చన్ లు వెళ్లలేదట. అంతేకాదు, అంతకు ముందు దర్శకనిర్మాత కరణ్ జొహార్ వేసిన స్పెషల్ షోకు కూడా వెళ్లలేదు. మరోవైపు, ఐష్ భర్త అభిషేక్ బచ్చన్ ఇంత వరకు ఈ సినిమాను చూడలేదని తెలిపాడు. మరోవైపు, ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్లలో యంగ్ హీరో రణబీర్ కపూర్, ఐశ్వర్య లిప్ లాక్ సీన్లను తొలగించాలంటూ కరణ్ జొహార్ ను అమితాబ్ కోరినట్టు ఇంతకు ముందే వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ సినిమాలోని పలు రొమాంటిక్ సీన్లను సెన్సార్ బోర్డు తొలగించింది. ఏదేమైనప్పటికీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ఇంట్లో జరుగుతున్న తతంగంపై బాలీవుడ్ సర్కిల్ లో పెద్ద చర్చే జరుగుతోంది.

  • Loading...

More Telugu News