: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం... పదిమంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో ఈ రోజు మధ్యాహ్నం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మండి జిల్లాకు సమీపంలోని జార్జ్ ప్రాంతం మీదుగా వెళుతోన్న ఓ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పడంతో లోయలో పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికుల్లో పది మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. పలువురికి గాయాలయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించేందుకు శ్రమిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.