: 2003లో బీజేపీ చేసిందాన్ని ఎలా మర్చిపోతా?: మాయావతి


బీజేపీతో కలసి పనిచేయడం కానీ, పొత్తు పెట్టుకోవడం కానీ ఉండనే ఉండదని బీఎస్పీ అధినేత్రి మాయావతి తేల్చి చెప్పారు. బీజేపీ తనను పెట్టిన టార్చర్ ను ఎన్నటికీ మర్చిపోనని చెప్పారు. గతంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో... 2003లో తాజ్ కారిడార్ కేసులో తనను ఎంతగా వేధించారో ఎలా మర్చిపోగలనని అన్నారు. కాన్షీరామ్ చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్న సమయంలో, తమ కుటుంబంపై బీజేపీ దాడులు చేయించిందని చెప్పారు. రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండానే విజయం సాధిస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సాంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు, మైనారిటీలు తమ వెంటే ఉన్నారని మాయావతి తెలిపారు. ఎస్పీలో వాళ్లకు వాళ్లే కొట్టుకుంటున్నారని... బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేది కేవలం బీఎస్పీ మాత్రమే అని చెప్పారు.

  • Loading...

More Telugu News