: ఆల్ ఖైదా కీలక నేత ఫరూక్ అల్ ఖతాని హతం


ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన కీలక నేత ఫరూక్ అల్ ఖతానిని అమెరికా భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని పెంటగాన్ ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్ లోని కునార్ లో అమెరికా బలగాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన దాడుల్లో ఖతాని హతమయ్యాడని తెలిపింది. తూర్పు ఆఫ్ఘనిస్థాన్ లో ఆల్ ఖైదాకు ఖతాని నాయకత్వం వహిస్తున్నాడు. మరో నాయకుడు బిలాల్ అల్ ఉతాబి కోసం గాలింపు జరుగుతోందని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పీటర్ కుక్ తెలిపారు.

  • Loading...

More Telugu News