: చిరంజీవితో కలిసి నటించాలని ఉంది: నటి కస్తూరి
మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని ఉందని ప్రముఖ నటి కస్తూరి తన మనసులో మాట బయటపెట్టింది. ‘భారతీయుడు’ చిత్రంలో ప్రముఖ నటుడు కమలహాసన్ కు చెల్లెలుగా, ‘అన్నమయ్య’ చిత్రంలో నాగార్జున సరసన నాయికగా నటించిన కస్తూరి ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కమల్ తో నటించడమంటే ఎంతో భాగ్యం చేసుకున్నట్లుగా భావిస్తున్నానని చెప్పింది. తమిళ్ లో రజనీకాంత్ తో నటించలేదని చెప్పిన కస్తూరి, మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వర పరిచిన పాటలను తాను వినని రోజు అంటూ లేదని, ఆ సంగీతం అంత అద్భుతంగా ఉంటుందని కస్తూరి చెప్పింది. కాగా, 'భారతీయుడు' చిత్రంలోని ‘పచ్చని చిలుకలు తోడుంటే..’ అనే పాటలో కమల్ తో ఆడిపాడే కస్తూరిగా ప్రేక్షకుల మదిలో ఆమె గుర్తుండిపోయింది.