: టీఎస్ఎంసీ సంచలన నిర్ణయం.. తప్పుడు వైద్యం చేసిన పలువురు వైద్యులపై వేటు


తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. పలువురు వైద్యులపై వేటు వేస్తున్నట్లు మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది. నిఖిల్ రెడ్డి ఎత్తు పెరిగేందుకు ఆపరేషన్ చేసిన గ్లోబల్ ఆసుపత్రి డాక్టరు చంద్రభూషణ్ పై రెండేళ్లు, కేపీహెచ్బీ కి చెందిన 'సృష్టి బేబీకేర్' సెంటర్ డాక్టరు నమ్రతపై ఐదేళ్లు, జగిత్యాలకు చెందిన డాక్టరు మనోజ్ కుమార్ తో పాటు, మరో ఏడుగురు వైద్యులపై మూడు నెలల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. తప్పుడు వైద్యం చేస్తే శిక్ష తప్పదని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) హెచ్చరించింది. ఈ సందర్భంగా పలు కార్పొరేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News