: అవాస్తవాలను ప్రచారం చేసేందుకే జగన్ సభ: మంత్రి గంటా
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవాస్తవాలను ప్రచారం చేసేందుకే జగన్ ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభను నిర్వహిస్తున్నాడని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షనేతగా విఫలమైన జగన్, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ సభను నిర్వహించనున్నారంటూ మండిపడ్డారు. గతంలో గర్జనల పేరిట బహిరంగ సభలను నిర్వహించిన జగన్, ఇప్పుడు, ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరిట బహిరంగ సభను నిర్వహించి తన బాణీని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.