: కాకినాడలో వెంక‌య్య‌నాయుడు స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ‘జ‌న‌సేన’ కార్య‌క‌ర్త‌ల ఆందోళ‌న‌


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కేంద్ర స‌హ‌కారం, ఆర్థిక ప్యాకేజీపై తూర్పుగోదావ‌రి జిల్లాలోని కాకినాడ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఈరోజు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. స‌భ‌లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్ర‌సంగిస్తోన్న స‌మ‌యంలో కాసేపు గంద‌ర‌గోళం నెల‌కొంది. ప్ర‌త్యేక హోదా గురించి వివ‌రిస్తూ హోదాను స‌రిహ‌ద్దు రాష్ట్రాల వారికే ఇస్తార‌ని, ప్ర‌త్యేక ప్యాకేజీతో రాష్ట్రానికి లాభాలున్నాయ‌ని వెంక‌య్య చెప్పారు. అయితే, సభలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ‘జ‌న‌సేన’ కార్య‌క‌ర్త‌లు వెంక‌య్య ప్ర‌సంగిస్తుండ‌గానే ఆందోళ‌న చేశారు. 'ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు' అంటూ వారు నినాదాలు చేశారు. ప్ర‌త్యేక ప్యాకేజీ కాదు, రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదానే కావాల‌ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News