: ప్రొ.కోదండరాం కాంగ్రెస్‌కు మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు: ఎంపీ బాల్క సుమన్
తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాంపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మేధావి ముసుగులో కోదండరాం ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తూ తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు మేలు చేసే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కొత్త జిల్లాల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అంటే కోదండరాంకు ఎందుకు ఇష్టం లేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు.