: మాస్క్ వేసి పిల్లలను స్కూల్ కు పంపించాలంటూ పాఠశాలల నుంచి తల్లిదండ్రులకు మెసేజ్ లు


ఢిల్లీలో పెరిగిపోయిన కాలుష్యంపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప‌రిశోధ‌కులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసిన సంగతి తెలిసిందే. సమస్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలోని పాఠ‌శాల‌లు తమ వ‌ద్ద చ‌దువుకునే పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప‌లు జాగ్ర‌త్త‌లు చెబుతూ మెసేజ్‌లు పంపుతున్నారు. ఇంటి నుంచి పిల్ల‌లు బ‌య‌లుదేరేట‌ప్పుడు వారు కచ్చితంగా మాస్క్ ధరించేలా చూడాలని పాఠ‌శాల‌లు సూచిస్తున్నాయి. వాతావ‌ర‌ణంలో గాలి కాలుష్యం అధిక‌మ‌యిపోవ‌డంతో తాము మెసేజ్‌లు పంపుతున్న‌ట్లు పేర్కొంటున్నాయి. దీపావ‌ళికి బాణసంచా కాల్చడానికి తోడు, నగర శివారుల్లో భారీ ఎత్తున వరికుంచెలు తగులబెట్టడం కారణంగా ఢిల్లీలో ఈ వాతావరణ సమస్య తలెత్తింది.

  • Loading...

More Telugu News