: ‘నా భర్త క్షేమంగా ఉన్నారు’.. హైకోర్టుకు తెలిపిన మావోయిస్టు నేత ఆర్కే భార్య శిరీష
ఇటీవల ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని ఆర్కే భార్య శిరీష హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్కే క్షేమంగా ఉన్నాడంటూ సమాచారం రావడంతో ఆమె ఈ రోజు తన భర్త క్షేమంగా ఉన్నారని హైకోర్టుకు తెలిపారు. దీంతో శిరీష వేసిన హెబియస్ కార్పస్ వ్యాజ్యం ఉపసంహరణకు ఆమె తరఫు న్యాయవాది రఘునాథ్ న్యాయస్థానంలో అనుమతి కోరారు. పిటిషన్ ఉపసంహరణ విన్నతిని తమకు లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కోర్టు సూచించింది.