: ఎన్టీఆర్ పై వీరాభిమానం... గుడి కట్టించి, నిత్య పూజలు నిర్వహించడమే ఆయన సంకల్పం
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావుకు గుడికి కట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు పెనుమచ్చ శ్రీనివాసులు అనే వీరాభిమాని. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని కంచనపల్లె గ్రామానికి చెందిన ఆయన ఇప్పటికే చిన్న ఆలయాన్ని నిర్మించాడు. తనకు వచ్చే వృద్ధాప్యపు పింఛను, కొందరు దాతల సహాయంతో ఈ గుడిని కట్టించాడు. త్వరలోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని అందులో ప్రతిష్టించి, నిత్య పూజలు జరిగేలా చేయాలన్నదే ఆయన సంకల్పం. తనకు తగినంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో... చిన్నపాటి చిల్లర అంగడి నిర్వహిస్తూ తన కలను సాకారం చేసుకోవడానికి యత్నిస్తున్నాడు. దాతల సహకారంతో తన సంకల్పాన్ని పూర్తి చేస్తానని ఆయన చెబుతున్నాడు.