: మహిళనని నమ్మించి 14 మంది యువతులను మోసం చేసిన 24 ఏళ్ల యువకుడు


తాను మహిళనని నమ్మించి, ఉద్యోగాల పేరుతో యువతులను నమ్మించి వారి నుంచి డబ్బులు, విలువైన వస్తువులు దోచుకున్న యువకుడి బాగోతం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. భివాండీలో నివసించే విశ్వనాథ్ పాటిల్ సోషల్ మీడియాలో జయా పాటిల్ పేరుతో నకిలీ ఖాతా ప్రారంభించాడు. దాని ద్వారా ఉద్యోగాల కోసం వెతుకున్న యువతులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికేవాడు. ఇందుకోసం వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. తర్వాత బ్యాంకులో పనిచేస్తున్న తన సోదరుడు విశ్వనాథ్‌ను కలిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేవాడు. అతడి చేతిలో మోసపోయిన ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసగాడి బాగోతం బట్టబయలైంది. జయ మహిళ కాదని కల్యాణ్‌కు చెందిన వ్యక్తి అని తెలుసుకున్న పోలీసులు ఫిర్యాదు చేసిన ఓ యువతితో కలిసి నిందితుడిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. ఆమెతో నిందితుడికి ఫోన్ చేయించారు. తాను కల్యాణ్‌లోనే ఉన్నానని, కలవాలని చెప్పడంతో వచ్చిన విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. అతడు ఇప్పటి వరకు 14 మంది యువతులను ఇలా మోసం చేశాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News