: ఏపీలో నిరుద్యోగులకు బంపరాఫర్.. వయోపరిమితి 42 ఏళ్లకు పెంపు?


నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించేందుకు సిద్ధమైంది. సర్కారు యోచిస్తున్నట్టు ప్రకటన వెలువడితే నిరుద్యోగులకు పండగే. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరద్యోగ అభ్యర్థుల వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఏపీలో ఉద్యోగ దరఖాస్తు వయోపరిమితి గతేడాది వరకు 34 ఏళ్లుగా ఉండేది. తర్వాత దానిని 40 ఏళ్లకు పెంచారు. ఇప్పుడు మరో రెండేళ్లు కలిపి 42 ఏళ్లుగా మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. 34 ఏళ్ల వయోపరిమితిని ఏడాదిపాటు 40 ఏళ్లకు పెంచుతూ గతేడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది గడువు ముగిశాక మరో ఏడాదిపాటు దానిని పెంచారు. అయితే గత కొన్నేళ్లుగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచి 42 ఏళ్లుగా మార్చాలని నిరుద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. త్వరలో విడుదల చేయబోయే గ్రూప్-2 నోటిఫికేషన్‌తోపాటు ఇతర ఉద్యోగాలకు దీనిని వర్తింపజేసే యోచనలో ఉన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు అధికారులతో మాట్లాడినట్టు సమాచారం. సీఎం నిర్ణయం మేరకు త్వరలో వయోపరిమితి పెంపును అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News