: టీఎస్ పీఎస్సీ గత గ్రూప్-1లో రెండు ప్రశ్నలకు మార్కుల తొలగింపు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో సిలబస్ లో లేని రెండు ప్రశ్నలను ఇచ్చినట్లు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆధ్వర్యంలోని కమిటీ తేల్చి చెప్పింది. పేపర్-1లోని 5ఎ, 5బి ప్రశ్నలు సిలబస్ లో లేనివని గుర్తిస్తూ ఈ మేరకు ఒక నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో రెండు ప్రశ్నలకు సంబంధించి మొత్తం 10 మార్కులు తొలగించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది. దీంతో, పేపర్-1ను 140 మార్కులకే మూల్యాంకనం చేయనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.