: కొండపల్లి ఆయిల్ డిపోల వద్ద ఉద్రిక్తత.. మెరుపు సమ్మెకు దిగిన డీలర్లు
కృష్ణా జిల్లా కొండపల్లి ఆయిల్ డిపోల వద్ద హెచ్ పీసీఎల్ వైఖరిని నిరసిస్తూ డీలర్లు మెరుపు సమ్మెకు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయిల్ డిపోల ముందు ఆందోళన చేస్తున్న డీలర్లను అరెస్ట్ చేశారు. ఇంధన ట్యాంకర్లను బయటకు పంపేందుకు హెచ్ పీసీయల్ యత్నిస్తోంది. అయితే, విజయవాడ, గుంటూరులో పెట్రోల్ బంకులను డీలర్లు మూసివేస్తున్నారు. కాగా, ఈ నెల 6వ తేదీన పెట్రోల్ బంకులు పూర్తి స్థాయిలో మూతపడనున్నాయి. పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై ఆయిల్ కంపెనీలు మార్జిన్ పెంచాలని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ బంద్ కు పిలుపునిచ్చాయి.