: మాజీ సైనికోద్యోగి రామ్ కిషన్ గ్రేవాల్ అంతిమయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ


వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ)పై కేంద్ర ప్ర‌భుత్వం తీరుకి నిరసన తెలుపుతూ మాజీ సైనికోద్యోగి రామ్ కిషన్ గ్రేవాల్ మ‌న‌స్తాపంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే ఈ రోజు హ‌ర్యానాలోని భివాండీలో ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌రిపారు. రామ్ కిష‌న్ అంత్య‌క్రియ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు, సీనియర్ నేతలు కమల్‌నాథ్, హరియాణా మాజీ సీఎం భూపేందర్‌సింగ్ హాజ‌ర‌య్యారు. రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జ‌ల తాకిడి అధికంగా క‌నిపించింది. కాగా, రామ్‌కిషన్‌ ఆత్మహత్య ఘ‌ట‌న‌పై కేంద్ర తీరుని త‌ప్పుబ‌డుతూ నిన్న రాహుల్ గాంధీ ఆందోళన చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆపై విడిచిపెట్టారు.

  • Loading...

More Telugu News