: వైకాపా... తెదేపా... కాంగ్రెస్... నల్లారి వారి చూపెటు?
మరో రాజకీయ పార్టీతో కలిసి నడిచేందుకు చర్చలు జరిగాయన్న సంకేతాలనిస్తూ మాజీ సీఎం, సమైక్యాంధ్ర పేరిట పార్టీ పెట్టి, ప్రజాభిమానాన్ని చూరగొనడంలో విఫలమైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన వేళ, ఆయన అనుచరుల్లో కొత్త చర్చ మొదలైంది. పెళ్లి గురించి మాట్లాడామని, తాళికట్టే తేదీ ఖరారైన తరువాత శుభలేఖలు పంపుతామని ఆయన నిన్న తన అనుచరుల ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఎవరి ఊహల్లోకి వారు వెళ్లిపోయి, ఏ పార్టీతో పొత్తుకు నల్లారి కిరణ్ ప్రయత్నిస్తున్నారన్న విషయమై మాట్లాడుకుంటున్నారు. ఆయన జగన్ నేతృత్వంలోని వైకాపాలోకి వెళ్లవచ్చని కొందరు, తెలుగుదేశం పార్టీతో మాట్లాడారని మరికొందరు, గతంలో విడిపోయిన కాంగ్రెస్ లోకే తిరిగి సమైక్యాంధ్ర పార్టీని విలీనం చేస్తారని మరికొందరు చెబుతున్నారు. ఈ విషయంలో నల్లారి వారి చూపెలా వుంది? ఆయన పయనమెటు? అన్న విషయాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.