: ఆందోళన కలిగిస్తున్న జర్నలిస్టుల హత్యలు.. దశాబ్దకాలంలో ప్రాణాలు కోల్పోయిన 827 మంది


యునెస్కో సంచలన నివేదిక ఒకదానిని బయటపెట్టింది. ప్రతి నాలుగున్నర రోజులకో జర్నలిస్ట్ చొప్పున హత్యకు గురవుతున్నారనేదే ఆ నివేదిక సారాంశం. గత దశాబ్ద కాలంలో ఏకంగా 827 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని యునెస్కో నివేదిక పేర్కొంది. సిరియా, ఇరాక్, లిబియా, యెమన్, లాటిన్ అమెరికా దేశాల్లోనే జర్నలిస్టులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఆయా దేశాల్లో జర్నలిస్టుల విధులు కత్తిమీద సాములా మారాయని వివరించింది. గత రెండేళ్లలోనే 59 శాతం హత్యలు జరిగినట్టు తెలిపింది. జర్నలిస్టుల హత్యలు ఎక్కువగా అరబ్ దేశాల్లోనే జరిగాయని, పశ్చిమ యూరోప్, ఉత్తర అమెరికాలోనూ జర్నలిస్టులు హత్యకు గురైనట్టు పేర్కొంది. విదేశీ జర్నలిస్టులతో పోలిస్తే స్థానిక జర్నలిస్టులకే అధిక ముప్పు పొంచి ఉన్నట్టు తెలిపింది. మహిళా జర్నలిస్టులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారని, వారిని అపహరించడం, హింసించి చంపడం లాంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News