: ప్రొఫెసర్ లక్ష్మి ఎంతో అసభ్యమైన పదజాలం వాడిందట!
ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే గుంటూరు మెడికల్ కళాశాలకు చెందిన పీజీ రెండో సంవత్సరం విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుందనే విషయాన్ని ఒక నివేదిక ద్వారా నిర్ధారించారు. ప్రొఫెసర్ లక్ష్మి ఎంత దారుణంగా ఆమెను వేధించింది, ఎలాంటి అసభ్య పదజాలం వాడిందనే విషయాలకు ఈ నివేదిక అద్దంపడుతుందని వైద్య విద్యాశాఖకు చెందిన పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక అధికారి పేర్కొన్నారు. ఒక అధ్యాపకురాలు, విద్యార్థి మధ్య ఈ తరహా వేధింపులు ఇప్పటివరకూ ఏ కళాశాలలోనూ చూడలేదన్నారు. విచారణ కమిటీ పొందుపరిచిన అంశాలను చూస్తే, ఒక ప్రొఫెసర్ గా అలాంటి అసభ్యపదజాలాన్ని ఆమె ఎలా వాడిందో జీర్ణించుకోలేని పరిస్థితి అన్నారు. సంధ్యారాణి సెలవులు కావాలని అడిగిన సందర్భంలో, ప్రొఫెసర్ లక్ష్మి వాడిన పదజాలం వినలేమన్నారు. ప్రతి విషయాన్ని భార్యాభర్తల లైంగిక విషయాలకు ముడిపెట్టి ప్రొఫెసర్ లక్ష్మి మాట్లాడేదంటూ ఆ కమిటీ నివేదిక ద్వారా తెలిసిందన్నారు.