: మావోయిస్టుల ఘాతుకం... యువకుడి హత్య
ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో దారుణంగా దెబ్బతిన్న మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. తమకు చెందిన సమాచారాన్ని పోలీసులకు అందజేస్తున్నాడనే అనుమానంతో జయంత్ అనే యువకుడిని హత్య చేశారు. ఈ ఘటన ఒడిశాలోని కలహండి జిల్లా త్రిలోచనపూర్ దగ్గర జరిగింది. మరోవైపు, ఐదు రాష్ట్రాల్లో రేపు బంద్ తలపెట్టారు మావోలు. ఈ సందర్భంగా విధ్వంసాలకు మావోలు పాల్పడవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత గాలింపు చేపట్టారు. కూంబింగ్ కోసం హెలికాప్టర్లను సైతం ఉపయోగిస్తున్నారు.