: ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.60 కోట్లు ఖర్చుపెట్టిన దుబాయ్ లో భారత్ వ్యాపారి


కారు ఫ్యాన్సీ నంబర్ కోసం దుబాయ్ వ్యాపారి ఒకరు రూ.60 కోట్లు ఖర్చు పెట్టాడు. దుబాయ్ లో ప్రాపర్టీ డెవలపర్ అయిన ఇండియన్ బల్వీందర్ సహాని తన కారు ఫ్యాన్సీ నంబర్ కోసం అక్టోబర్ 8న అక్కడి ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటలో పాల్గొన్నాడు. ‘డీ5’ అనే ఫ్యాన్సీ నంబర్ కోసం 33 మిలియన్ దిర్హామ్స్ (సుమారు 60 కోట్లు)ను చెల్లించి సొంతం చేసుకున్నాడు. కాగా, గత ఏడాది కూడా 09 అనే నంబర్ కోసం 6.7 మిలియన్ డాలర్లు చెల్లించి ఆయన దానిని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరిలాగే తాను కూడా మామూలు మనిషినని, ప్రతి సంవత్సరం తనకు తానే ఒక బహుమతి ఇచ్చుకుంటానని చెప్పాడు. తన వద్ద ఇంకా రెండు రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయని, వాటికి కూడా ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకునే ప్రయత్నం చేస్తానని చెప్పాడు.

  • Loading...

More Telugu News