: కమలహాసన్, గౌతమిలు విడిపోవడానికి కారణం ఇదేనా?
ప్రముఖ నటుడు కమలహాసన్ తో విడిపోతున్నానంటూ నటి గౌతమి చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివాహం చేసుకోనప్పటికీ, గత 13 సంవత్సరాలుగా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలసి బతికారు. గౌతమి బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్నప్పుడు కమల్ ఆమెకు అండగానే ఉన్నారు. ఆమెకు ఎంతో సేవ చేశారు. వీరిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఇలాంటి నేపథ్యంలో, కమల్ నుంచి విడిపోతున్నానంటూ గౌతమి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. దీనికంతటికీ కారణం కమల్ కుమార్తె, హీరోయిన్ శ్రుతిహాసన్ తో ఏర్పడ్డ విభేదాలే అని తెలుస్తోంది. 'శభాష్ నాయుడు' సినిమా షూటింగ్ లాస్ ఏంజెలెస్ లో జరుగుతున్న సమయంలో వీరిద్దరికీ విభేదాలు తలెత్తాయి. ఆ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా గౌతమి పనిచేసింది. అయితే, ఆమె ఎంపిక చేసిన దుస్తులు శ్రుతిహాసన్ కు నచ్చలేదట. ఇదే విషయాన్ని గౌతమి ముఖం మీదే చెప్పేసిందట. దీంతో, ఇద్దరి మధ్య గొడవ ఏర్పడింది. ఈ వ్యవహారంలో కమల్ తన కుమార్తె శ్రుతిహాసన్ వైపే నిలబడ్డారని... ఇది గౌతమికి తీవ్ర ఆవేదన కలిగించిందని సమాచారం. ఈ కారణంగానే కమల్ తో విడిపోవాలనే నిర్ణయానికి గౌతమి వచ్చుంటుందని చెబుతున్నారు. గత రెండు నెలలుగా కమల్ కు దూరంగానే ఉంటోంది గౌతమి. ఇప్పుడు తాజాగా, ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఏమైనా, కమల్ కు ఇది మూడో బ్రేకప్!