: నరేంద్రమోదీ మా హీరో.. ప్రపంచ బలూచ్ మహిళల వేదిక అధక్షురాలు ఖాద్రీ


బలూచిస్థాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై తొలిసారి పెదవి విప్పిన భారత ప్రధాని నరేంద్రమోదీ తమ హీరో అని ప్రపంచ బలూచ్ మహిళల వేదిక అధ్యక్షురాలు నయెలా ఖాద్రీ పేర్కొన్నారు. భారత్‌లో గతంలో ఉన్న ప్రభుత్వాలు తమ గురించి పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నరేంద్రమోదీ బలూచిస్థాన్‌పై బహిరంగంగా మాట్లాడారని అన్నారు. భారతీయుల నుంచి తాము ఎంతో ఆశిస్తున్నామని, మోదీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని తెలిపారు. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అంతర్జాతీయ వేదికలపై బలూచిస్థాన్ సమస్యలపై ప్రస్తావించారని పేర్కొన్నారు. తమపట్ల భారత్ ఎంత తీవ్రంగా స్పందిస్తుందో చెప్పేందుకు ఇంతకంటే వేరే నిదర్శనం అవసరం లేదని ఖాద్రీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News