: కాకినాడలో ఇంజనీరింగ్ విద్యార్థుల కొట్లాటలు.. పలువురికి గాయలు
బుద్దిగా చదువుకోవాల్సిన విద్యాలయంలో రౌడీలుగా మారారు. ఇలాంటి వారా.. దేశ భవితవ్యాన్ని మార్చేది? అనే ప్రశ్నకు తావిచ్చారు. కాకినాడలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల కొట్లాటలతో గతంలోనే వార్తల్లో ఉంది. మళ్లీ తాజాగా అదే కాలేజీలో స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య గొడవలు రాజుకున్నాయి. ఇరువైపుల వారు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఉత్తరాది విద్యార్థులను కళాశాల నుంచి బహిష్కరించాలని స్థానిక విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.