: ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌’ దీపావ‌ళిని జరుపుకొని దేశానికే ఆదర్శంగా నిలిచిన సిక్కిం


దీపావళి పండుగ వస్తుందంటేనే వాతావరణం కాలుష్యంతో నిండిపోతుందని ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోన్న విష‌యం విదిత‌మే. అయితే, ఈ విషయంలో చాలామందికి అవ‌గాహ‌న క‌లగడంతో ఈ సారి కొద్దిగా ట‌పాసుల మోత‌ను తగ్గించారు. అయితే, దేశంలోనే అతిచిన్న రాష్ట్రం సిక్కిం పూర్తిస్థాయిలో ప‌ర్యావ‌ర‌ణానికి హాని త‌ల‌పెట్టకుండా దీపావ‌ళిని జ‌రుపుకొని దేశానికే స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్రంలో బాణ‌సంచాపై బ్యాన్ విధించి అందరితో శ‌భాష్ అనిపించుకుంది. రెండేళ్ల క్రితం దీపావళి సంద‌ర్భంగా ఆ రాష్ట్రంలో వెలువడిన శబ్ద, వాయు కాలుష్యం కార‌ణంగా 2014లో డిసెంబర్‌ 19న సిక్కిం ప్ర‌భుత్వం బాణసంచాను బ్యాన్ చేసింది. గ‌త ఏడాది ఆ రాష్ట్రంలో టపాసుల వాడకం 50 శాతానికి తగ్గింది. ఈ సారి ప్రజల్లో మ‌రింత అవ‌గాహనను తీసుకొచ్చేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులతో ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యంపై నాటకాలు కూడా వేయించారు. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు అద్భుతంగా స్పందించి ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌’ దీపావ‌ళిని నిర్వ‌హించుకున్నారు.

  • Loading...

More Telugu News