: విడిపోతున్న కమలహాసన్-గౌతమి జంట .. బాధగా ఉందంటున్న గౌతమి!


ప్రముఖ హీరో కమలహాసన్, గౌతమి జంట విడిపోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గౌతమి తన ట్విట్టర్ వేదికగా కమల్ నుంచి విడిపోతున్నట్లు పేర్కొంది. తన జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయమిదని తెలిపింది. 13 ఏళ్లుగా తమ సహజీవనం కొనసాగుతోందని, కుటుంబ కలహాలు, కొన్ని విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, విడిపోతున్నందుకు చాలా బాధగా ఉందని గౌతమి పేర్కొంది. కమల్ తన కలల హీరో అని, చిన్నప్పటి నుంచి తన అభిమాన నటుడని, ఆయన నుంచి విడిపోయినప్పటికీ తన హీరో కమలహాసనేనని గౌతమి పేర్కొంది.

  • Loading...

More Telugu News