: అద్దె ఇంటి కోసం వెతుకుతుంటే, ఇల్లు చూపిస్తూ అఘాయిత్యం!
తన భర్తతో కలసి అద్దె ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన ఓ యువతిపై ఏడుగురు అత్యాచారం చేసిన ఘటన ముంబైలో కలకలం రేపింది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, అంబోలీ ప్రాంతంలో అద్దె ఇంటిని వెతుకుతున్న సమయంలో, ఖాళీగా ఉన్న ఓ ఇంటిని చూసేందుకు ఆమె లోపలకు వెళ్లింది. ఆ సమయంలో ఇల్లు చూపించేందుకు లోపలికి వచ్చిన వారిలో ముగ్గురు ఆమె భర్తను బయటే నిర్బంధించగా, నలుగురు ఆమెపై అదే ఇంట్లో అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.