: నేను గెలిస్తే క్యాబినెట్ లోకి మిచెల్ ఒబామా: హిల్లరీ ఆఫర్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే, ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ను క్యాబినెట్ లోకి ఆహ్వానిస్తానని డెమొక్రాట్ల అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ స్పష్టం చేశారు. ఆమె ప్రభుత్వంలో భాగం కావాలని భావిస్తే, తనకో ఉత్తమ భాగస్వామి లభించినట్లని ఆమె అన్నారు. అమెరికా తొలి మహిళగా గడచిన ఆరేళ్లలో ఆమె దేశానికి ఎంతో సేవ చేశారని 'ఎక్స్ ట్రా టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా బాలికా విద్యపై అవగాహన పెంచేందుకు ఆమె ఎంతో కృషి చేశారని, తాము కలిసిన ప్రతిసారీ ఈ విషయంలో చర్చించుకునే వాళ్లమని అన్నారు. ప్రస్తుతం హిల్లరీ తుది దశ ప్రచారాన్ని ఉద్ధృతంగా సాగిస్తూ బిజీగా గడుపుతున్నారు.