: ఏలూరులో ఓటు నమోదు చేసుకోనున్న పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తన ఓటు నమోదు చేసుకోనున్నారు. ఏలూరులో ఓటు నమోదు చేయించుకోవాలని అభిమానులు, కార్యకర్తల కోరికపై పవన్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు అక్కడ ఓటు నమోదు చేసుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చూడాలని పార్టీ పరిపాలనా విభాగాన్ని పవన్ ఆదేశించారు. ఏలూరులో తన నివాసానికి అనుకూలమైన భవనాన్ని చూడాలని సూచించారు. కాగా, ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పవన్ కు ఓటు హక్కు ఉంది.